Kalpika Ganesh: వరుస వివాదాల్లో నటి కల్పిక.. ఈసారి రిసార్ట్‌లో హంగామా!

Actress Kalpika Creates Ruckus at Hyderabad Resort
  • వివాదాలకు మారుపేరుగా నిలిచిన నటి కల్పిక
  • బ్రౌన్‌టౌన్ రిసార్టు మేనేజర్‌తో గొడవ
  • రిసార్ట్ సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణ
వివాదాలకు మారుపేరుగా మారిన సినీ నటి కల్పిక మరోసారి వార్తల్లో నిలిచింది. నగర శివారులోని కనకమామిడి రెవెన్యూ పరిధిలో గల బ్రౌన్‌టైన్ రిసార్ట్‌లో ఆమె సృష్టించిన హంగామా ప్రస్తుతం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.

సోమవారం మధ్యాహ్నం బ్రౌన్‌టైన్ రిసార్ట్‌కు చేరుకున్న కల్పిక ఓ గదిలో విశ్రాంతి తీసుకుని భోజనం చేసింది. సాయంత్రం పొద్దుపోయాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సిగరెట్లు కావాలని రిసెప్షన్ సిబ్బందిని అడగగా, వారి నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో కల్పిక తీవ్ర ఆగ్రహానికి గురైంది. నేరుగా రిసెప్షన్‌కు వెళ్లి మేనేజర్ కృష్ణపై మండిపడింది. "గదిలో వైఫై లేదు, సౌకర్యాలు సరిగ్గా లేవు, కనీసం సిగరెట్లు కూడా తెచ్చివ్వరా?" అంటూ గట్టిగా కేకలు వేసింది. ఆగ్రహంతో ఊగిపోతూ గది తాళాలను విసిరేసి "ఇక్కడ ఉండలేను!" అంటూ దాదాపు గంటసేపు హంగామా సృష్టించి అక్కడి నుంచి నగరానికి వెళ్లిపోయింది.

మంగళవారం కల్పిక ఒక వీడియోను విడుదల చేసింది. రిసార్ట్ సిబ్బంది తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆ వీడియోలో ఆమె ఆరోపించింది. అయితే, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
Kalpika Ganesh
Kalpika
Brown Town Resort
Hyderabad
Resort controversy
Molestation Allegations
Moinabad Police
Telugu Actress
Viral Video
Cigarette Issue

More Telugu News