Gautam Gambhir: ఓవల్ మైదానంలో గంభీర్-క్యూరేటర్ గొడవ... అసలేం జరిగిందో చెప్పిన బ్యాటింగ్ కోచ్

Gautam Gambhir Clash with Oval Curator Explained by Batting Coach
  • చివరి టెస్టుకు సిద్ధమవుతున్న టీమిండియా 
  • లండన్ లోని ఓవల్ మైదానంలో ప్రాక్టీస్ 
  • పిచ్ క్యూరేటర్ పై గంభీర్ ఫైర్
ఓవల్ మైదానంలో భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్, పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్‌ల మధ్య జరిగిన వాగ్వాదంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు. భారత జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు గల కారణాలను కోటక్ మీడియాకు వివరించాడు.

"మంగళవారం మా జట్టు నెట్స్‌లో సాధన చేస్తోంది. అప్పుడే మా దగ్గరికి వచ్చిన చీఫ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్.. మీరు పిచ్ కు 2.5 మీటర్ల దూరంలో ఉండాలని చెప్పాడు. మ్యాచ్ కు ఉపయోగించే పిచ్ ను చూడాలనుకుంటే తాడుకు అవతలి వైపు నుంచి చూడాలని అన్నాడు. ఏ దేశంలోనూ, ఎవరూ ఇలా అనడం నేను చూడలేదు" అని కోటక్ తెలిపాడు.

ఫోర్టిస్ మాటలతో చిర్రెత్తుకొచ్చిన గంభీర్, "మేము ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాం.. నువ్వు నీ హద్దుల్లో ఉండు" అని బదులిచ్చారని కోటక్ వెల్లడించారు. అయినా సరే ఫోర్టిస్ ఆగలేదని, "నేను మీపై ఫిర్యాదు చేస్తాను" అని హెచ్చరించాడని కోటక్ వివరించాడు. "అప్పుడు గౌతీ 'నువ్వు మాకు ఏం చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు. మాకు అన్నీ తెలుసు. ఎవరికి ఫిర్యాదు చేసుకుంటావో చేసుకో' అని గట్టిగానే అతడికి చెప్పాడు" అని కొటక్ జరిగిన విషయాన్ని మీడియాకు స్పష్టం చేశాడు.

నెట్స్‌లో ఉన్నప్పుడు తమ ఆటగాళ్లు స్పైక్స్ కాకుండా జాగింగ్ షూ వేసుకున్నారని, అలాంటప్పుడు పిచ్ దెబ్బతినే అవకాశమే లేదని బ్యాటింగ్ కోచ్ తెలిపాడు. అంతేకాదు, అంతకుముందు ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఏకంగా పిచ్ మధ్యలో నిల్చొని క్యూరేటర్‌తో మాట్లాడిన విషయాన్ని కూడా కోటక్ ప్రస్తావించాడు. ఈ సంఘటనపై తాము ఐసీసీకి ఫిర్యాదు చేయబోమని కోటక్ స్పష్టం చేశారు. 
Gautam Gambhir
Gautam Gambhir Oval
Lee Fortis
Sitanshu Kotak
Team India practice
Oval pitch controversy
India cricket
Brendon McCullum
ICC
Oval curator

More Telugu News