CM Ramesh: సీఎం రమేశ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు?: సీతక్క

Why KTR is not responding to CM Ramesh remarks Seethakka
  • బీజేపీతో కుమ్మక్కు వల్లే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రాలేదన్న మంత్రి
  • సీఎం రమేశ్ వ్యాఖ్యలతో మరోసారి తేలిపోయిందన్న మంత్రి సీతక్క
  • ప్రజాప్రభుత్వ పాలనను వారు ఓర్చుకోలేకపోతున్నారని ఆగ్రహం
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ మంత్రి సీతక్క ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లాకు బయలుదేరిన సీతక్క నార్సింగి వద్ద మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసంలో అల్పాహారం కోసం ఆగారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కైందని సీఎం రమేశ్ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైందని అన్నారు. కాషాయ పార్టీతో కుమ్మక్కవడం వల్లే లోక్‌సభలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని విమర్శించారు. ప్రజాస్వామ్య పాలనను వారు సహించలేకపోతున్నారని ధ్వజమెత్తారు.

బీజేపీతో కుమ్మక్కైన విషయం లోక్‌సభ ఎన్నికలతో రుజువు కావడంతో పాటు, సీఎం రమేశ్ కూడా అదే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం రమేశ్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఎందుకు సవాల్ చేయడం లేదో చెప్పాలని నిలదీశారు. 
CM Ramesh
KTR
Seethakka
BRS BJP alliance
Telangana politics
Lok Sabha elections

More Telugu News