Suniel Shetty: ఇండస్ట్రీలో మా వాడ్ని తొక్కేసేందుకు ప్రయత్నించారు: సునీల్ శెట్టి

Suniel Shetty Opens Up About Ahan Shettys Struggles in Bollywood
  • సునీల్ శెట్టి వారసుడిగా అహాన్ శెట్టి 
  • బోర్డర్-2 చిత్రంలో కీలక పాత్ర
  • బోర్డర్-2 చిత్రానికి సైన్ చేశాక అహాన్ ను అనేక సినిమాల నుంచి తప్పించారన్న సునీల్ శెట్టి
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన కుమారుడు అహాన్‌ శెట్టి సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న కష్టాల గురించి బాహాటంగా మాట్లాడారు. 1997 నాటి హిట్ వార్ డ్రామా 'బోర్డర్'కి సీక్వెల్ అయిన 'బోర్డర్ 2' కోసం అహాన్‌ సంతకం చేసిన తర్వాత, అతడిని అనేక ప్రాజెక్టుల నుంచి కావాలనే పక్కన పెట్టారని సునీల్ శెట్టి ఆరోపించారు.

ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, 'బోర్డర్ 2'లో నటించడం ద్వారా అహాన్‌ కు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ వంటివారితో విలువైన స్నేహబంధాలను ఏర్పడ్డాయని సునీల్ అభిప్రాయపడ్డారు. వారు అహాన్‌ను చిన్న తమ్ముడిలా చూసుకుంటారని ఆయన పేర్కొన్నారు. "గతంలో నేను ఏదో తప్పు చేసి ఉంటాను... అందుకే వారు అహాన్‌ను లక్ష్యంగా చేసుకుని, అతడిని కొన్ని సినిమాల నుంచి తొలిగించినట్టుంది" అని చెప్పారు. అయితే, విధిని మార్చలేమని స్పష్టం చేశారు.

సినీ పరిశ్రమలో షార్ట్‌కట్‌ల కంటే కష్టపడటానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని సునీల్ నొక్కి చెప్పారు. 'బోర్డర్ 2' గొప్ప విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్లకు పైగా వసూలు చేయాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే, సన్నీ డియోల్, వరుణ్, దిల్జిత్ వంటి అగ్ర తారలతో పాటు అహాన్‌ కూడా గుర్తింపు పొందాలని ఆయన ఆకాంక్షించారు. తన కుమారుడికి వంశపారంపర్యంగా కాకుండా, అతని వ్యక్తిత్వం, స్వరం, వినయం కారణంగానే మంచి సినిమాలు వస్తున్నాయని సునీల్ స్పష్టం చేశారు.

కాగా, బోర్డర్ చిత్రంలో సునీల్ శెట్టి నటించగా, ఇప్పుడు బోర్డర్-2లో ఆయన తనయుడు నటించడం విశేషం అని చెప్పాలి. 
Suniel Shetty
Ahan Shetty
Border 2
Bollywood
Varun Dhawan
Diljit Dosanjh
Border movie
Bollywood nepotism
Indian Cinema
Box office collection

More Telugu News