Rustam Bhagwagar: లైంగిక వేధింపుల ఆరోపణలు.. అమెరికాలో భారత సంతతి కోపైలట్‌ అరెస్ట్

Rustam Bhagwagar Indian Origin Copilot Arrested in US on Sexual Assault Charges
  • డెల్టా ఎయిర్‌లైన్స్‌లో విధులు నిర్వహిస్తున్న రుస్తుం భగ్వాగర్
  • శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో కాక్‌పిట్ నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బేడీలు వేసి తీసుకువెళ్లిన వైనం
చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో భారత సంతతికి చెందిన కోపైలట్‌ రుస్తుం భగ్వాగర్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో అతడిని కాక్‌పిట్ నుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను డెల్టా ఎయిర్‌లైన్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

డెల్టా సంస్థకు చెందిన బోయింగ్ విమానం మిన్నియాపోలీస్ నుంచి బయలుదేరి శాన్‌ఫ్రాన్సిస్కోలో ల్యాండ్ అయింది. విమానం ఆగిన కాసేపటికి పోలీసులు కాక్‌పిట్‌లోకి దూసుకొచ్చి భగ్వాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హఠాత్ పరిణామానికి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అతడికి బేడీలు వేసి తీసుకెళ్లారు.

భగ్వాగర్ తప్పించుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు గోప్యంగా అరెస్టు ప్రక్రియను చేపట్టారు. చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం అతడిని అరెస్టు చేశారు. డెల్టా సంస్థ ఈ అరెస్టుపై స్పందించింది. అనైతిక ప్రవర్తనను తమ సంస్థ ఏమాత్రం సహించదని, అతడిపై వచ్చిన అభియోగాలు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయని పేర్కొంది. అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Rustam Bhagwagar
Rustam Bhagwagar arrest
Indian origin pilot
child sexual abuse

More Telugu News