Ayyanna Patrudu: నర్సీపట్నంలో ఓవర్ లోడ్ తో వెళుతున్న వాహనాలను ఆపిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu Stops Overloaded Vehicles in Narsipatnam
  • సొంత నియోజకవర్గంలో అయ్యన్న చర్యలు
  • ఓవర్ లోడ్ వాహనాల బిల్లులు పరిశీలించిన స్పీకర్
  • నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు 
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఓవర్ లోడ్ తో వెళుతున్న పలు వాహనాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆపారు. ఓవర్ లోడ్ వాహనాల లోడు బరువు బిల్లులను ఆయన పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆయా వాహనాలను స్వాధీనం చేసుకోవాలని పోలీసులను ఆదేశించారు. 

ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, తాళ్లపాలెం వంతెన ఇప్పటికే శిథిలావస్థకు చేరిందని తెలిపారు. ఓవర్ లోడ్ తో వెళితే ఈ బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. 

కాగా, సొంత నియోజకవర్గంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చర్యలను స్థానికులు ప్రశంసించారు. 
Ayyanna Patrudu
Narsipatnam
Overload vehicles
Tallapalem bridge
Anakapalli district
Vehicle seizure
Bridge collapse risk
Andhra Pradesh
Road safety

More Telugu News