శ్రీవారికి కానుకగా 2.5 కిలోల బంగారు శంకు చక్రాలు
- చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ స్వామివారికి ఖరీదైన కానుక
- సుమారు రూ. 2.4 కోట్ల విలువైన బంగారు శంకు చక్రాలు సమర్పణ
- రంగనాయకుల మండపంలో అదనపు ఈఓకు అందజేసిన కంపెనీ ప్రతినిధులు
అనంతరం ఏఈఓ వెంకయ్య చౌదరి దాతల్ని శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారికి చెన్నై భక్తులు అందించిన బంగారు శంఖం, చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2.5 కిలోల బంగారంతో తయారుచేసిన ఈ ఆభరణాలను ఆలయంలో స్వామివారికి అలంకరించనున్నారు.