Nisha: తమ్ముడికి వచ్చిన వ్యాధి బయపటడితే పరువు పోతుందని.. హత్యచేసిన అక్క

Nisha murders brother with husbands help fearing disease stigma
  • కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని దమ్మి గ్రామంలో ఘటన
  • రోడ్డు ప్రమాదంలో గాయపడిన తమ్ముడు
  • ఆసుపత్రిలో చేరిస్తే నయం కాని వ్యాధి సోకినట్టు వైద్యుల గుర్తింపు
  • మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్తూ భర్తతో కలిసి తమ్ముడి గొంతుకు టవల్ బిగించి హత్య
  • అంత్యక్రియల సమయంలో గుర్తించిన తండ్రి
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమ్ముడికి నయం కాని వ్యాధి సోకిన విషయం బయటకు తెలిస్తే కుటుంబ పరువు పోతుందనే భయంతో అక్క తన భర్త సాయంతో సొంత తమ్ముడిని హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.  

పోలీసులు వివరాల ప్రకారం హొళల్కెర పరిధిలోని దుమ్మి గ్రామానికి చెందిన నాగరాజప్పకు మల్లికార్జున, నిశా సంతానం. నిశాకు శ్యామనూరుకు చెందిన మంజునాథ్‌తో వివాహం జరిగింది. మల్లికార్జున బెంగళూరులో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. మల్లికార్జున ఇటీవల సొంతూరు వస్తుండగా అతడు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన మల్లికార్జునను దావణగెరెలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు, మల్లికార్జునకు నయం కాని వ్యాధి సోకినట్టు గుర్తించి ఈ విషయాన్ని నిశాకు తెలిపారు.

మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు మల్లికార్జునను వాహనంలో తీసుకెళ్తుండగా మల్లికార్జున తన అక్క నిశాతో మాట్లాడుతూ తనకు నయం కాని వ్యాధి సోకిన విషయం, అప్పులు చేసిన సంగతి చెబుతూ తనకు జీవించే ఆసక్తి లేదని బావురుమన్నాడు. దీంతో ఈ వ్యాధి గురించి బయటకు తెలిస్తే కుటుంబ పరువు పోతుందని భావించిన నిశా.. తన భర్త మంజునాథ్ సాయంతో మార్గమధ్యలో మల్లికార్జున గొంతుకు టవల్ బిగించి హత్య చేసింది.

ఎలా బయటపడింది?
మల్లికార్జునను హత్య చేసిన తర్వాత నిశా, మంజునాథ్ దంపతులు ఈ ఘటనను దాచిపెట్టడానికి ప్రయత్నించారు. మల్లికార్జున మృతదేహాన్ని దుమ్మి గ్రామానికి తీసుకొచ్చి మార్గమధ్యలో అతడు మరణించినట్టు కుటుంబ సభ్యులను నమ్మించారు. అయితే, అంత్యక్రియల సమయంలో మల్లికార్జున గొంతు వద్ద గాయాలను గమనించిన అతడి తండ్రి నాగరాజప్పకు అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. వారొచ్చి నిశా, మంజునాథ్‌లను నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హొళల్కెర పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకొని హత్య కేసు నమోదు చేశారు. 
Nisha
Karnataka crime
fratricide
family honor killing
brother murder
Chitradurga district
Holalkere
incurable disease
Manjunath
crime news

More Telugu News