Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జిల నియామకం

Four Additional Judges Appointed to Telangana High Court
  • దేశంలోని పలు హైకోర్టులకు 19 మంది జడ్జిలు, అదనపు జడ్జిల నియామకం
  • జడ్జిలు, అదనపు జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర
  • వెల్లడించిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్
తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. దేశంలోని పలు హైకోర్టులకు చెందిన 19 మంది న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తుల నియమకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం పలువురు న్యాయవాదులు, జ్యుడీషియల్ ఆఫీసర్లను న్యాయమూర్తులుగా, అదనపు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

ఈ మేరకు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రకటన విడుదల చేశారు. నియామకం పొందిన 19 మందిలో తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులుగా గౌస్ మీరా మొహియుద్దీన్, చలపతిరావు సుద్దాల, వాకిటి రామకృష్ణారెడ్డి, గడి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. వీరితో పాటు మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు, నలుగురు అదనపు న్యాయమూర్తులు, గౌహతి హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు.
Telangana High Court
Gous Meera Mohiuddin
Chalapathi Rao Suddala
Vakiti Ramakrishna Reddy

More Telugu News