Mithun Reddy: రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డిని కలిసిన తల్లి స్వర్ణలత

Mithun Reddys Mother Swarnalatha Visits Him in Rajahmundry Jail
  • ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్
  • రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి 
  • నేడు ములాఖత్ లో మిథున్ రెడ్డిని కలిసిన కుటుంబ సభ్యులు
  • కొడుకును చూసి కంటతడిపెట్టిన స్వర్ణలత
ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో, మిథున్ రెడ్డిని ఆయన తల్లి స్వర్ణలత నేడు కలిశారు. 

కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి వచ్చిన స్వర్ణలత... జైలులో ఉన్న తనయుడ్ని చూసి తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కుమారుడి పరిస్థితి వివరిస్తూ కంటతడిపెట్టారు. జైలులో తన బిడ్డకు తగిన సౌకర్యాలు కల్పించడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా కుమారుడు ఏమైనా ఉగ్రవాదా? అంటూ ఆక్రోశించారు. మిథున్ రెడ్డికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మిథున్ రెడ్డితో ములాఖత్ అయిన వారిలో తల్లి స్వర్ణలత వెంట ఆయన సోదరి శక్తి, బావ అఖిల్ కూడా ఉన్నారు. వారు మిథున్ రెడ్డికి ధైర్యం చెప్పారు.  
Mithun Reddy
AP Liquor Scam
YSRCP MP
Rajahmundry Central Jail
Swarnalatha
Liquor Case Arrest
Andhra Pradesh Politics
Jail Conditions

More Telugu News