షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు.. ఇదిగో వీడియో!
ఏం జరిగిందో తెలియక సహచరులు దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి లేపే ప్రయత్నం చేశారు. కానీ, కళ్లు తెరవకపోవడంతో వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రాకేశ్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడు రాకేశ్‌ది ఖమ్మం జిల్లా తల్లాడ. చేతికి వచ్చిన కుమారుడు ఇలా మృతి చెందడంతో తల్లిదండ్రులు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.