Ayatollah Khamenei: ఈసారి నిన్నే టార్గెట్ చేస్తాం.. ఇరాన్ సుప్రీం లీడర్ కు ఇజ్రాయెల్ వార్నింగ్

Israel Warns Iran Supreme Leader Ayatollah Khamenei
  • ఇజ్రాయెల్ ను బెదిరించడం మానుకోండి
  • అయతుల్లా ఖమేనీకి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హితవు
  • మేం మళ్లీ దాడి చేయాల్సి వస్తే నీకు హాని తప్పదంటూ హెచ్చరిక 
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమను బెదిరించడం మానుకోకుంటే ఈసారి వ్యక్తిగతంగా ఆయననే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని స్పష్టం చేసింది. ఈమేరకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. జూన్ 13న ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ ఆపరేషన్ ను విజయవంతంగా ముగించిన ఎయిర్ ఫోర్స్ ను అభినందిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కట్జ్ మాట్లాడారు.

ప్రధాని బెంజామిన్ నెతన్యాహు సమక్షంలో ఇరాన్ సుప్రీం లీడర్ కు కట్జ్ వార్నింగ్ ఇచ్చారు. తమ ఎయిర్ ఫోర్స్ సిబ్బందిపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇరాన్ నుంచి దేశానికి పొంచి ఉన్న ముప్పును తొలగించారని వారిని కొనియాడారు. కాగా, అయతుల్లా ఖమేనీకి ఇజ్రాయెల్ గతంలోనూ ఇదేవిధంగా హెచ్చరికలు జారీచేసింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ కొనసాగిస్తున్న సమయంలోనూ ఖమేనీని వదిలిపెట్టేది లేదనే సందేశం ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన ఇరాన్ భద్రతా బలగాలు ఖమేనీని గుర్తుతెలియని ప్రాంతానికి తరలించాయి.

ఆ సమయంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ ఉన్నారనే విషయానికి సంబంధించి కచ్చితమైన లొకేషన్ తమతో పాటు ఇజ్రాయెల్ కు కూడా తెలుసని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి వారు (ఇజ్రాయెల్ బలగాలు) ఖమేనీని చంపబోరని వ్యాఖ్యానించారు. బేషరతుగా లొంగిపోవాలంటూ ఖమేనీకి వార్నింగ్ ఇచ్చారు.
Ayatollah Khamenei
Israel
Iran
Benjamin Netanyahu
Katz
Operation Rising Lion
Iran Supreme Leader
Israel Defense Minister
Donald Trump
Israel Air Force

More Telugu News