నేటి నుంచి హరిహర వీరమల్లు టికెట్ రేట్ల తగ్గింపు
- ఈ నెల 24న విడుదలైన హరి హర వీరమల్లు
- మూవీ విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపుకు రెండు ప్రభుత్వాలు అనుమతి
- నేటి నుంచి సాధారణ ధరలకే మూవీ టికెట్లు
పవన్ కల్యాణ్ నటన, యాక్షన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ సినిమాను మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా పెంచిన టికెట్ ధరలను అందుబాటులోకి తెచ్చింది. నేటి (సోమవారం) నుంచి సాధారణ ధరలకే ఈ సినిమా టికెట్లు లభించనున్నాయి.
ఈ నేపథ్యంలో బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో ఇప్పటికే ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సినిమాను మరింత మందికి చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సింగిల్ స్క్రీన్‌లలో బాల్కనీ టికెట్ రూ.175లు, మల్టీ ప్లెక్స్‌లలో రూ.295లకే టికెట్లు లభించనున్నాయి. దీంతో సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.