Raja Singh: రాజీనామాపై మరోసారి స్పందించిన రాజాసింగ్

Raja Singh Responds Again on Resignation
  • ఇటీవలే బీజేపీకి గుడ్ బై చెప్పిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
  • తన రాజీనామా వెనుక ఎలాంటి కుట్రలేదని వెల్లడి
  • అన్నీ ఆలోచించే రాజీనామా చేశానని స్పష్టీకరణ
హైదరాబాదులోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేయడం తెలిసిందే. బీజేపీ హైకమాండ్ చెబితే, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని వెల్లడించారు. తాజాగా ఆయన తన రాజీనామాపై మరోసారి స్పందించారు. 

తన రాజీనామా వెనుక ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు. ఎవరి వల్ల పార్టీకి డ్యామేజి జరిగిందో, ఆ విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి చెప్పడానికి ప్రయత్నించానని వెల్లడించారు. లక్షల మంది కార్యకర్తలు బీజేపీ కోసం తమ జీవితాలను త్యాగం చేశారని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఒక యోధుడు కావాలి అని అన్నారు. 

కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తనకు ఫోన్ చేయలేదని, ఆయన ఫోన్ చేసేంతటి పెద్ద వ్యక్తిని కానని రాజాసింగ్ అన్నారు. తాను మళ్లీ బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నానని, అందుకే కార్యకర్తల బృందాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పంపానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. తాను అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
Raja Singh
Raja Singh BJP
Goshamahal MLA
Telangana BJP
BJP resignation
Amit Shah
BJP high command
Telangana politics

More Telugu News