Sperm Clinic Raid: స్పెర్మ్ డొనేషన్ దందా.. క్లినిక్ పై పోలీసుల రెయిడ్

Hyderabad Sperm Clinic Racket Exposed Police Raid
  • అహ్మదాబాద్ లో సంతాన సాఫల్య కేంద్రం, హైదరాబాద్ లో వీర్యం సేకరణ
  • వీర్య దాతలకు రూ.4 వేలు చెల్లిస్తున్న నిర్వాహకులు
  • టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాకంతో రాష్ట్రంలోని స్పెర్మ్ క్లినిక్ లపై దాడులు
సికింద్రాబాద్ లో సంతానం కోసం వెళ్లిన దంపతులకు వేరొకరి వీర్య కణాలతో చికిత్స చేసిన టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాకం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. డీఎన్ఏ టెస్టుతో సదరు టెస్ట్ ట్యూబ్ సెంటర్ భాగోతం బయటపడగా.. నిర్వాహకులపై బాధిత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెంటర్ నిర్వాహకురాలైన వైద్యురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతం నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు స్పెర్మ్ క్లినిక్ లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఉన్నతాధికారులు దాడులు చేశారు. దీంతో నగరంలోని ఓ స్పెర్మ్ క్లినిక్ దందా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ లోని ఓ స్పెర్మ్ క్లినిక్ పలువురు దాతల నుంచి వీర్యం సేకరిస్తోంది. వీర్య దానం చేసిన ప్రతిసారీ దాతలకు రూ. 4 వేల చొప్పున చెల్లిస్తోంది. ఇలా సేకరించిన వీర్యాన్ని గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్ కు పంపిస్తోంది. ఇక్కడ సేకరించిన వీర్యంతో అక్కడ సంతానం లేని దంపతులకు పిల్లలు పుట్టేలా చికిత్స చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

సికింద్రాబాద్ లోని ఇండియన్ స్పెర్మ్ క్లినిక్ ఈ దందా నిర్వహిస్తోంది. ఈ క్లినిక్ కు ఎలాంటి అనుమతులు లేవని గుర్తించిన అధికారులు.. కేసు నమోదు చేసి నిర్వాహకులతో పాటు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తాజా ఘటనల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంతాన సాఫల్య కేంద్రాలు, స్పెర్మ్ క్లినిక్ లలో సోదాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Sperm Clinic Raid
Hyderabad Sperm Clinic
Sperm Donation Racket
Fertility Center
Sperm Donation
Infertility Treatment
Secunderabad
Ahmedabad
DNA Test
Police Raid

More Telugu News