Operation Sindoor: స్కూలు పిల్లల పాఠ్యాంశంగా ‘ఆపరేషన్ సిందూర్’

Operation Sindoor included in school syllabus by NCERT
  • పాఠ్య పుస్తకాలలో చేర్చనున్న ఎన్ సీఈఆర్టీ
  • ప్రత్యేక మాడ్యూల్ ను సిద్ధం చేస్తున్న అధికారులు
  • విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించడమే ఉద్దేశం
జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. సరిహద్దులతోపాటు పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది. అర్ధరాత్రి పూట 23 నిమిషాల పాటు జరిగిన ఈ ఆపరేషన్ లో మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ఆపరేషన్ వివరాలను స్కూలు పిల్లలకు పాఠ్యాంశంగా బోధించాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలోనే ప్రకటన చేశారు.

తాజాగా ఈ విషయంపై నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్ సీఈఆర్టీ) స్పందించింది. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్ ను సిలబస్ లో చేర్చుతున్నట్లు తెలిపింది. పిల్లలకు జాతీయ భద్రత, సైనిక వ్యూహం, దౌత్యం ప్రాముఖ్యతను బోధించడమే ఈ నిర్ణయం వెనకున్న లక్ష్యమని తెలిపింది.

ఇందుకోసం ఎన్ సీఈఆర్టీ ప్రత్యేక మాడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. ఈ మాడ్యూల్‌ను రెండు భాగాలుగా విభజిస్తారు. ఒకటి 3- 8 తరగతుల విద్యార్థుల కోసం, మరొకటి 9 నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం రూపొందిస్తారు. ఆదిత్య ఎల్1, చంద్రయాన్ అంతరిక్ష మిషన్లు, ఇటీవల శుభాన్షు శుక్లా 'అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)'కు వెళ్లిన అంశాలను కొత్త సిలబస్‌లో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
Operation Sindoor
Indian Army
Jammu Kashmir
Pahalgam
NCERT
National Council of Educational Research and Training
Dharmendra Pradhan
textbook syllabus
Shubhanshu Shukla
Chandrayaan Aditya L1

More Telugu News