Vijay Deverakonda: తిరుపతిలో కింగ్డమ్ ట్రైలర్ లాంచ్... చిత్తూరు యాసలో అదరగొట్టిన విజయ్ దేవరకొండ!

Vijay Deverakonda Kingdom Trailer Launched in Tirupati
  • తిరుపతి వెంకన్న సామి కరుణిస్తే టాప్‌లోకి వచ్చేస్తానన్న విజయ్ దేవరకొండ
  • తిరుపతిలో జరిగిన కింగ్డమ్ మూవీ ట్రైలర్ విడుదల వేడుక
  • ఈ నెల 31న విడుదల కానున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ కింగ్డమ్
ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో మాట్లాడి అభిమానులను అలరించారు. విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'కింగ్డమ్' ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో నిన్న ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో మాట్లాడుతూ.. " ఏమి ఎట్లాఉండారు అందరూ..బాగున్నారా..బాగుండాలి..అందరూ బాగుండాలి..అందరం బాగుండాలి..ఈ తూరి నేరుగా మీకాడికే వచ్చినాము..మీ అందరినీ కలిసినాము..ట్రైలర్ లేట్ అయినది. అయినా మీ అందరితో పాటు ట్రైలర్ చూసినాము.. మీ అరుపులు కేకలు వింటుంటే ..శానా అంటే శానా సంతోషంగా అనిపిస్తోంది అబ్బా.. మీ అందరికీ ఓ మాట సెప్పాల. నేను ఏనాడు ఈ మాట బయటకు సెప్పిందే లే. గత ఏడాది నుంచి 'కింగ్డమ్' మూవీ గురించి ఆలోచిస్తుంటే నా తలకాయలో ఒక్కటే తిరుగుతాంది. నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తోంది. మన తిరుపతి ఏడు కొండల వెంకన్నస్వామి కానీ, ఈ ఒక్కసారి నా పక్కన ఉండి నడిపించినాడో.. చాలా పెద్దోడినై పూడుస్తా సామి.. పోయి టాప్‌లో కూర్చొంటా. ఎందుకంటే ప్రతిసార్లా పారం పెట్టి గట్టిగా పని చేసినా. ఈసారి సినిమాను బాగా చూసుకునేందుకు దర్శకుడు గౌతమ్ తిన్నసూరి, పాలెగాడు అనిరుధ్, ఎడిటర్ నవీన్ నూలి ఉన్నారు. వారితో పాటు నిర్మాత నాగవంశీ ఇంటర్వ్యూలు సంపినాడులే. కొత్త పాత భాగశ్రీ బాగా పని చేసింది. ఇంకా చాలా మంది పని చేస్తా ఉన్నారు. ఇక మిగిలింది రెండే. ఆ వెంకన్న స్వామి దయ. మీ అందరి ఆశీస్సులు. ఈ రెండు నాతో పాటు ఉంటే, ఎవరూ మనల్ని ఆపలేరు. నాలుగు రోజుల్లో మిమ్మల్ని అందరినీ థియేటర్స్‌లో కలుస్తా" అని అన్నారు. తమ ప్రాంత, రాయలసీమ యాసలో విజయ్ దేవరకొండ మాట్లాడటంతో అభిమానులు ఉప్పొంగి కేరింతలు కొట్టారు. 

Vijay Deverakonda
Kingdom movie
Tirupati
Trailer launch
Rayalaseema dialect
Goutham Tinnanuri
Anirudh
Naga Vamsi
Telugu cinema
Kingdom trailer

More Telugu News