TTD: ఆ హోమం టికెట్లు ఇకపై ఆన్ లైన్ లోనే... టీటీటీ నిర్ణయం

TTD to Issue Homam Tickets Online Only
  • శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్లను ఆన్‌లైన్ లోనే విక్రయించడం జరుగుతుందన్న టీటీడీ
  • ఆగస్టు 1 నుంచి నిత్యం 200 టికెట్లు ఆన్‌లైన్ లో విక్రయం
  • హోమంలో పాల్గొన్న గృహస్తులకు రూ.300ల ప్రవేశ ప్రత్యేక దర్శనం కల్పిస్తామన్న టీటీడీ  
తిరుపతి అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిరోజు నిర్వహించే శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్లను ఇకపై ఆన్‌లైన్‌లో మాత్రమే జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారానే ఈ టికెట్ల విక్రయం జరుగుతుంది.

ప్రస్తుతం భక్తులకు కరెంట్ బుకింగ్ ద్వారా 50 టికెట్లు, ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తున్నారు. అయితే, భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు 1 నుంచి మొత్తం 200 టికెట్లను ఆన్‌లైన్ ద్వారానే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. 

భక్తుల కోరిక మేరకు శ్రీవారి పాదాల వద్ద తమ శుభకార్యాలు, విశేషమైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం సంకల్పం చెప్పుకుని యజ్ఞం నిర్వహించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ విశేష హోమంలో రూ.1600 చెల్లించి గృహస్థులు ఇద్దరు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న గృహస్థులకు రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు. 
TTD
Tirumala Tirupati Devasthanams
Saptagopradakshina Mandiram
Sri Srinivasa Divyanugraham
Online Ticket Booking
Yagam
Special Darshan
Pilgrimage
Hindu Temple

More Telugu News