Telangana Rains: తెలంగాణ‌లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు

Telangana Rains Heavy to Very Heavy Rainfall Expected Today
  
తెలంగాణ‌లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఇక, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది.

అలాగే జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నిర్మల్‌, నిజామాబాద్‌, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉన్న‌ట్టు  తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Telangana Rains
Hyderabad weather
heavy rainfall alert
Adilabad
Asifabad
Telangana weather forecast
India Meteorological Department
orange alert
yellow alert
weather warning

More Telugu News