Ruchi Gujjar: మోసం చేశాడంటూ నిర్మాతను చెప్పుతో కొట్టిన నటి.. వీడియో ఇదిగో!

Actress Ruchi Gujjar accuses producer Karan Singh Chauhan of cheating
  • ముంబైలో మూవీ స్క్రీనింగ్ టైంలో ఘటన
  • మీడియా సమక్షంలోనే దాడి చేసిన సీరియల్ నటి రుచి గుజ్జర్
  • నిర్మాత కరణ్ సింగ్ చౌహాన్ పై మోసం, నమ్మకద్రోహం కేసు
బాలీవుడ్ నిర్మాత కరణ్ సింగ్ చౌహాన్ పై సీరియల్ నటి రుచి గుజ్జర్ దాడి చేసింది. కరణ్ సింగ్ నిర్మించిన ‘సో లాంగ్ వ్యాలీ' చిత్రం స్క్రీనింగ్ సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. మీడియా ప్రతినిధుల సమక్షంలో రుచి గుజ్జర్ ఆయనపైకి చెప్పు విసిరింది. తనను మోసం చేశాడని, సహ నిర్మాతగా తీసుకుంటానని రూ.24 లక్షలు కాజేశాడని రుచి ఆరోపించింది. దీనికి సంబంధించి చౌహాన్ పై మోసం, నమ్మకద్రోహం, బెదిరింపుల కేసు పెట్టానని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రుచి గుజ్జర్ తెలిపిన వివరాల ప్రకారం.. కరణ్ సింగ్ చౌహాన్ ఓ టీవీ సీరియల్ నిర్మిద్దామని ప్రతిపాదించగా తాను రూ.24 లక్షలు ఇచ్చానని చెప్పింది. అయితే, రోజులు గడుస్తున్నా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకపోవడంతో తాను కరణ్ ను నిలదీయగా.. సాకులు చెప్పి తప్పించుకున్నాడని ఆరోపించింది. దీంతో తన డబ్బు తిరిగివ్వాలని కోరగా బెదిరింపులకు దిగాడని రుచి తెలిపింది.

ఈ క్రమంలోనే ‘సో లాంగ్ వ్యాలీ' మూవీ స్క్రీనింగ్ సమయంలో నిరసన తెలిపేందుకు వచ్చినట్లు రుచి గుజ్జర్ వివరించింది. ఈ వివాదం నేపథ్యంలో పోలీసులు కల్పించుకుని రుచి గుజ్జర్ ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. కరణ్ సింగ్ పై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Ruchi Gujjar
Karan Singh Chauhan
So Long Valley
Bollywood producer
cheating allegations
actress assault
film screening
police investigation
financial dispute
TV serial production

More Telugu News