Kingdom Movie: ‘కింగ్‌డమ్’ సెన్సార్ పూర్తి
- విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో ‘కింగ్‌డమ్’
- తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న మూవీ
- సినిమాకు యూ/ఏ (U/A) సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
- ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన మేకర్స్
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌డమ్’. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ విషయాన్ని మేకర్స్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా అధికారికంగా ప్రకటించారు.
ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ‘కింగ్‌డమ్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రౌడీ బాయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, సత్యదేవ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరోవైపు, ఇవాళ తిరుపతిలో జరగనున్న కింగ్‌డమ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సినిమా ట్రైలర్ విడుదల కానుంది.