కర్నూలు జిల్లాలో డ్రోన్ నుంచి క్షిపణి పరీక్ష విజయవంతంపై చంద్రబాబు హర్షం
- కర్నూలులోని ఎన్ఓఏఆర్‌లో డ్రోన్‌తో క్షిపణి పరీక్ష
- శాస్త్రవేత్తలు, అవిష్కర్తలకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
- ఎక్స్ వేదికగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ కు స్పందించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (ఎన్ఓఏఆర్)లో యూఏవీ-లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (యూఎల్‌పీజీఎం-V3) పరీక్షను విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు సీఎం ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. మన దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు.
యూఎల్‌పీజీఎం-వీ3 విజయం ఆత్మ నిర్భర్ భారత్ యొక్క నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ట్వీట్‌ను చంద్రబాబు రీట్వీట్ చేశారు.