Telangana Government: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం

Telangana Government Appoints Special Officers for Joint Districts
  • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సీఎస్
  • ప్రత్యేక అధికారులుగా హైదరాబాద్‌ జిల్లాకు ఇలంబర్తి, రంగారెడ్డికి దివ్య
  • ప్రత్యేక అధికారులు తమ తమ జిల్లాల్లో పర్యటించాలని ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ జిల్లాకు ఇలంబర్తి, రంగారెడ్డి - డి. దివ్య, ఆదిలాబాద్ సి. హరికిరణ్, నల్గొండ - అనితా రామచంద్రన్, నిజామాబాద్ - ఆర్. హనుమంతు, మహబూబ్‌నగర్ - రవి, కరీంనగర్ - సర్ఫరాజ్ అహ్మద్, వరంగల్ - కె. శశాంక్, మెదక్ - ఎ శరత్, ఖమ్మం - కె. సురేంద్ర మోహన్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన జిల్లాలను సందర్శించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిస్థితిని ఎదుర్కోవడానికి సంసిద్ధతపై అన్ని విభాగాలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆపద మిత్రులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకోవాలని సూచించారు.
Telangana Government
Telangana rains
Special Officers Appointment
Heavy Rains Telangana

More Telugu News