Thavisak: భార్య విడాకులు.. మనస్తాపంతో నెల రోజుల్లో 100 బీర్లు తాగి భర్త మృతి

Thavisak Dies After Drinking 100 Beers in a Month Due to Divorce
  • థాయ్‌లాండ్‌లో విషాదకర సంఘటన
  • 44 ఏళ్ల థవీసక్‌కు విడాకులు ఇచ్చిన భార్య
  • మనోవేదనతో తినడం పూర్తిగా మానివేసిన భర్త
  • ఆసుపత్రిలో చేర్చడానికి ముందే మృతి చెందిన భర్త
భార్య విడాకులు ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఒక వ్యక్తి నెల రోజులపాటు ఆహారం తీసుకోకుండా కేవలం బీర్లు మాత్రమే తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది.

44 ఏళ్ల థవీసక్‌కు అతని భార్య విడాకులు ఇచ్చింది. వారికి పదహారేళ్ల కుమారుడు ఉన్నాడు. కుమారుడిని థవీసక్ వద్దే ఉంచి ఆమె వెళ్లిపోయింది. భార్య తనను వదిలి వెళ్ళడంతో తీవ్ర వేదనకు గురైన థవీసక్ ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేశాడు. రోజంతా బీర్లు తాగుతూ గడిపాడు.

దీంతో అతని శరీరంలోని అవయవాలు సరిగా పనిచేయకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. పరిస్థితి విషమించడంతో ఒక స్వచ్ఛంద సంస్థ థవీసక్‌‌ను ఆసుపత్రిలో చేర్పించాలని ప్రయత్నించింది. అయితే, స్వచ్ఛంద సంస్థ సభ్యులు అతని ఇంటికి చేరుకునేలోపే థవీసక్ మరణించాడు. విచారణ జరిపిన అధికారులు అతని గదిలో 100 బీరు సీసాలను గుర్తించారు. అధిక మొత్తంలో మద్యం సేవించడం వల్లే అతను మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Thavisak
Thailand
Divorce
Beer
Alcoholism
Death
Health
Alcohol Abuse
Family Problems
Suicide

More Telugu News