Thailand Cambodia Border Conflict: థాయ్‌లాండ్‌, కాంబోడియా బార్డ‌ర్‌లో ఉద్రిక్త‌త‌.. భారతీయులకు ఎంబ‌సీ కీలక సూచ‌న‌

Indian Embassy In Thailand Issues Travel Advisory Amid Border Tensions
  • థాయ్‌లాండ్‌, కంబోడియాలో యుద్ధమేఘాలు
  • ఈ ఘర్షణలలో ఓ సైనికుడితో పాటు 15 మంది మృతి
  • తాజా ఉద్రిక్తతల నేప‌థ్యంలో అప్రమత్తమైన భార‌త్‌
  • భారతీయుల కోసం థాయ్‌లాండ్‌లోని భారత ఎంబ‌సీ కీలక అడ్వైజరీ జారీ
థాయ్‌లాండ్‌, కంబోడియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల స‌రిహ‌ద్దు వెంబ‌డి అనేక ప్రాంతాల్లో రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలలో ఓ సైనికుడితో పాటు 15 మంది మృతి చెందారు. తాజా ఉద్రిక్తతల నేప‌థ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. 

ఈ మేరకు భారతీయుల కోసం థాయ్‌లాండ్‌లోని ఇండియ‌న్‌ ఎంబ‌సీ కీలక ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా పోస్టు పెట్టింది. భారత పౌరులు థాయ్‌లోని ఏడు ప్రావిన్స్‌లవైపు ప్రయాణించొద్దని తెలిపింది. ఉబోన్‌ రాట్చథాని, సురిన్‌, సిసాకెట్‌, బురిరామ్‌, సా కాయో, చంతబురి, ట్రూట్‌.. ఈ ఏడు ప్రావిన్స్‌లకు దూరంగా ఉండాలని సూచించింది. 

ఇదిలాఉంటే.. సరిహద్దు పొడవున ఆరు ప్రాంతాలలో ఘర్షణలు జరుగుతున్నట్లు థాయ్‌ రక్షణ శాఖ ప్రతినిధి సురసంత్‌ కాంగ్‌సిరి తెలిపారు. బుధవారం థాయ్‌లో జరిగిన మందుపాతర పేలుడు తాజా ఘర్షణలకు కార‌ణ‌మైంది. ఈ పేలుడులో ఐదుగురు థాయ్‌ సైనికులు గాయపడ్డారు. 

ఈ మందుపాతర పేలుడుకు కంబోడియా కారణమని థాయ్‌ ఆరోపించగా, అది ఏనాటి మందుపాతరో అయి ఉండవచ్చని, దీంతో తమకు సంబంధం లేదని కంబోడియా చెబుతోంది. ఈ నేప‌థ్యంలో బార్డ‌ర్ గుండా ఇరు దేశాల సైనికులు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. రెండు దేశాల సైనికుల మధ్య సరిహద్దు వెంబడి శుక్రవారం తెల్లవారుజామున రెండోరోజు కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. 
Thailand Cambodia Border Conflict
Thailand
Cambodia
Indian Embassy Advisory
Ubon Ratchathani
Surin
Sisaket
Sa Kaeo
Travel Advisory

More Telugu News