PM Modi: ప్ర‌ధానిగా ఇందిరాగాంధీ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన‌ మోదీ

Narendra Modi becomes 2nd longest serving PM in India surpasses Indira Gandhis record
  • ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు
  • ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా మోదీ
  • ఇవాళ్టితో ఆయన ప్రధానిగా బాధ్య‌త‌లు చేపట్టి 4,078 రోజులు పూర్తి
  • ఇంత‌కుముందు ఈ రికార్డు దివంగ‌త ప్ర‌ధాని ఇందిరాగాంధీ పేరిట
ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా ఇందిరాగాంధీ పేరిట‌ ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇవాళ్టితో ఆయన ప్రధానిగా బాధ్య‌త‌లు చేపట్టి 4,078 రోజులు పూర్తిచేసుకున్నారు. దీంతో దేశానికి ఏకబిగిన ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచారు. దివంగత ఇందిరాగాంధీ 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు 4,077 రోజులు ప్రధానిగా ఉన్నారు. 

అయితే, దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మొదట ఆ రికార్డు సాధించిన విషయం తెలిసిందే. 2014, మే 26న నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో వరసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని అందించిన ఘనత నెహ్రూ, మోదీలకు ద‌క్కింది

అలాగే స్వాతంత్య్రం తర్వాత జన్మించి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన కాంగ్రెసేతర వ్యక్తిగా మోదీ రికార్డుకెక్కారు. లోక్‌సభలో రెండు సార్లు పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలో వచ్చిన కాంగ్రెసేతర పార్టీ నేతగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు. ఇందిరాగాంధీ (1971) తర్వాత అత్యధిక మెజార్టీతో అధికారం చేపట్టిన ప్రధానిగా నిలిచారు. 

అటు, సీఎంగా, ప్రధానిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి మోదీకే చెందుతుంది. 2001 అక్టోబర్ 7న తొలిసారి గుజరాత్ సీఎం అయిన మోదీ.. 2014లో ప్రధాని అయ్యేవరకు ఆ పదవిలో కొనసాగారు. అప్పటినుంచి ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గుజరాత్ సీఎంగా 2002, 2007, 2012 ఎన్నికల్లో బీజేపీని గెలిపించారు. 

అదేవిధంగా 2014, 2019, 2024లో ప్రధాని అభ్యర్థిగా కమలం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దాంతో దేశంలో సీఎంలు, ప్రధానమంత్రులందరిలో వరసగా ఆరు ఎన్నికల్లో ఒక పార్టీపక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేతగా నరేంద్ర మోదీ రికార్డుకెక్కారు. 
PM Modi
Prime Minister Modi
India Prime Minister
Indira Gandhi
Jawaharlal Nehru
Longest Serving PM
BJP
Indian Politics
Gujarat CM
2024 Elections

More Telugu News