చాహల్ కు ఫన్నీగా బర్త్ డే విషెస్ తెలిపిన ఆర్జే మహ్వాష్
- చాహల్, ఆర్జే మహ్వాష్ మధ్య ఏదో ఉందంటూ కొంతకాలంగా కథనాలు
- తరచుగా కలిసి కనిపిస్తున్న జోడీ
- చాహల్ 35వ పుట్టినరోజు వేళ మహ్వాష్ ఆసక్తికర సందేశం
మహ్వాష్, చాహల్ ఇద్దరూ తమను ‘కేవలం స్నేహితులు’ అని పిలుచుకున్నప్పటికీ, వారు లండన్‌లో కలిసి కనిపించడం, పలు చోట్ల కలిసి ఉన్నప్పటి ఫొటోలను సోషల్ మీడియా ఫోటోలు షేర్ చేయడం ఊహాగానాలకు అవకాశం ఇచ్చింది. ఓ ట్రావెల్ బ్లాగర్ చిత్రీకరించిన ఒక వీడియోలో వారు లండన్ వీధుల్లో కలిసి నడుస్తూ, ఉల్లాసంగా కనిపించారు. మహ్వాష్, చాహల్ గతంలో కూడా సోషల్ మీడియా పోస్ట్‌లు, పబ్లిక్ సైటింగ్‌ల ద్వారా వార్తల్లో నిలిచారు. వారి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కెమిస్ట్రీ అభిమానులను వారి సంబంధం గురించి ఊహాగానాలకు గురిచేస్తోంది.
చాహల్, ధనశ్రీవర్మ జోడీ కొన్నాళ్ల కింద విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాహల్... ఆర్జే మహ్వాష్ తో క్లోజ్ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.