IMD Amaravati: బంగాళాఖాతంలో అల్పపీడనం... మరింత బలపడే అవకాశం

Low Pressure Forms in Bay of Bengal IMD
  • ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
  • రాగల 24 గంటల్లో మరింత బలపడుతుందన్న ఐఎండీ అమరావతి విభాగం
  • ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
ఉత్తర బంగాళాఖాతంలో ఈ ఉదయం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని తెలిపింది. రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, దానికి అనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరాల వైపు కదిలే సూచనలు ఉన్నాయని వివరించింది. 

కాగా, ఈ అల్పపీడనంపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) అప్ డేట్ ఇచ్చింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
IMD Amaravati
IMD
India Meteorological Department
Bay of Bengal depression
low pressure area
Andhra Pradesh rains
APSDMA
North Andhra districts
West Bengal
Odisha coast

More Telugu News