Chandrababu Naidu: ఏపీ కేబినెట్ భేటీ.. చంద్రబాబు అధ్యక్షతన 40 అంశాలపై చర్చ

Chandrababu Naidu chairs AP Cabinet meeting on 40 issues



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు ఉదయం కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సచివాలయంలో కొనసాగుతున్న ఈ సమావేశంలో దాదాపు 40కి పైగా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలోనే ఏపీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్షరింగ్ పాలసీపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

రూ.50వేల కోట్లకు పైగా పెట్టుబడులపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు, అదేవిధంగా అమరావతిలో వివిధ నిర్మాణాలకు సంబంధించి సీఆర్‌డీఏ అథారిటీ నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నట్లు, అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం సవరణలు చేయనున్నట్లు తెలుస్తోంది. సీఆర్‌డీఏతో పాటు మెట్రోపాలిటన్‌, పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే ప్రక్రియకు కేబినెట్‌ చట్ట సవరణలు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Chandrababu Naidu
AP Cabinet Meeting
Andhra Pradesh
AP Electronics Manufacturing Policy
Amaravati
CRDA
Land Regularization

More Telugu News