Ravindra Jadeja: అరుదైన ఘనతకు 12 పరుగుల దూరంలో రవీంద్ర జడేజా
- ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న జడ్డూ
- మరో 12 రన్స్ చేస్తే చాలు టీమిండియా తరఫున తొలి ఆటగాడిగా ఘనత
- ఓవరాల్‌గా వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ సరసన చేరనున్న జడేజా
- ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో వెయ్యి ప్లస్ రన్స్, 30 ప్లస్ వికెట్లు పడగొట్టిన ఏకైక విదేశీ ప్లేయర్ సోబర్స్
- జడేజా ఇప్పటికే 30 వికెట్లు పడగొట్టగా.. 988 రన్స్ చేసిన వైనం
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు ఓ అరుదైన ఘనతకు చేరువగా ఉన్నాడు. మరో 12 రన్స్ చేస్తే చాలు టీమిండియా తరఫున తొలి ఆటగాడిగా నిలుస్తాడు. ఓవరాల్‌గా వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ సరసన చేరతాడు.
ఇంతకీ ఆ అరుదైన ఘనత ఏంటంటే..!
ఇంగ్లండ్ గడ్డపై టెస్టు ఫార్మాట్‌లో వెయ్యి ప్లస్ రన్స్, 30 ప్లస్ వికెట్లు పడగొట్టిన ఏకైక విదేశీ ప్లేయర్ గ్యారీ సోబర్స్. ఈ కరేబియన్ ఆటగాడు 21 టెస్టుల్లో 1,820 పరుగులు, 30 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే 30 వికెట్లు పడగొట్టగా... 988 రన్స్ చేశాడు.
అంటే మరో 12 పరుగులు చేస్తే ఈ క్లబ్‌లో చేరే తొలి భారతీయ ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంటాడు. జడ్డూ తర్వాతి స్థానంలో కపిల్ దేవ్ 638 పరుగులు, 43 వికెట్లు.. వినూ మన్కడ్ 395 రన్స్, 20 వికెట్లు.. రవిశాస్త్రి 503 పరుగులు, 11 వికెట్లు ఉన్నారు. కాగా, 1000+ రన్స్, 30+ వికెట్ల జాబితాలో ఇంగ్లండ్ తరఫున ఏకంగా 12 మంది ఆటగాళ్లు ఉన్నారు.