Gold Price: మళ్లీ రూ. 1 లక్ష దాటిన బంగారం ధర, సరికొత్త శిఖరాలకు వెండి ధర

Gold Price Exceeds Rs 1 Lakh Silver Reaches New High
  • అంతర్జాతీయ, మార్కెట్ అనిశ్చితుల నేపథ్యంలో పెరుగుతున్న ధరలు
  • కిలో వెండి రూ. 1.15 లక్షలు పలికి ఆల్ టైమ్ గరిష్ఠం నమోదు
  • ఈరోజు రూ. 1,357 పెరిగి రూ. 1,15,850కి చేరుకున్న వెండి ధర
బంగారం, వెండి ధరలు తిరిగి పెరిగాయి. పసిడి ధర మరోమారు రూ. 1 లక్ష మార్కును అధిగమించగా, కిలో వెండి ధర రూ. 1.15 లక్షలకు చేరి సరికొత్త గరిష్ఠస్థాయిని నమోదు చేసింది. అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా వీటి ధరలు పెరిగాయి.

ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.99,508 నుండి రూ.1,00,533కు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పెరిగింది. నిన్న రూ.91,149గా ఉన్న పసిడి ధర ఈరోజు రూ. 92,088కి చేరుకుంది. 10 గ్రాముల 18 క్యారెట్ల పసిడి ధర రూ. 74,631 నుండి రూ. 75,400కు పెరిగింది.

వెండి ధర ఒక్కరోజేలోనే రూ. 1,357 పెరిగింది. కిలో వెండి ధర రూ. 1,14,493 నుండి రూ. 1,15,850కు చేరుకుంది. ఈ సంవత్సరం జనవరి నుంచి వెండి ధర 34 శాతానికి పైగా పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో కిలో వెండి ధర రూ. 86,055గా నమోదైంది.
Gold Price
Gold
Silver Price
Silver
Indian Bullion and Jewellers Association

More Telugu News