Yadagirigutta Temple: యాదగిరిగుట్ట 41 రోజుల ఆదాయం ఎంతంటే? 12 దేశాల కరెన్సీలు సమర్పించిన భక్తులు

Yadagirigutta Temple Hundi Income Reaches Over 24 Million
  • నగదు, కానుకలను లెక్కించిన ఆలయ సిబ్బంది
  • రూ. 2,45,48,023 నగదు సమకూరినట్లు వెల్లడించిన ఈవో
  • స్వామి వారికి బంగారం, వెండి సమర్పించిన భక్తులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. గత 41 రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, నగల కానుకలను బుధవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. రూ. 2,45,48,023 నగదు సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకట్రావు వెల్లడించారు. దీంతో పాటు 38 గ్రాముల బంగారం, 2,800 గ్రాముల వెండి, వివిధ దేశాల కరెన్సీలు హుండీ ఆదాయం ద్వారా సమకూరినట్లు తెలిపారు.

విదేశీ కరెన్సీ విషయానికి వస్తే అమెరికా 1036 డాలర్లు, ఆస్ట్రేలియా 5 డాలర్లు, ఇంగ్లండ్ 45 పౌండ్లు, సౌదీ అరేబియా 5 రియాల్, సింగపూర్ 10 డాలర్లు, మలేసియా 23 రింగిట్స్, కెనడా 20 డాలర్లు, ఒమన్ 500 బైస, అరబ్ ఎమిరేట్స్ 70 థీరమ్స్‌తో సహా 12 దేశాల కరెన్సీలు లక్ష్మీనరసింహస్వామి వారికి సమర్పించారు.
Yadagirigutta Temple
Yadagirigutta
Lakshmi Narasimha Swamy Temple
Temple Income

More Telugu News