Telangana Government: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్

Telangana Government Appoints Sub Collectors to 2023 Batch IAS Officers
  • 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్
  • ఆరుగురికి సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు
  • నారాయణఖేడ్ సబ్ కలెక్టర్‌గా ఉమాహారతి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఆరుగురు ఐఏఎస్ అధికారులకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇచ్చారు.

నారాయణఖేడ్ సబ్ కలెక్టర్‌గా ఉమాహారతి, భైంసాకు అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్మూర్‌కు అభిజ్జాన్ మాల్వియా, కల్లూరుకు అజయ్ యాదవ్, భద్రాచలానికి మృణాళ్ శ్రేష్ఠ, బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా మనోజ్‌ను నియమిస్తూ సీఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana Government
IAS officers
Sub Collectors
Uma Harathi
Ajmeera Sanketh Kumar

More Telugu News