Yashasvi Jaiswal: నాలుగో టెస్టులో టీమిండియా ఓపెనర్ల శుభారంభం

Yashasvi Jaiswal and KL Rahul give India a solid start
  • భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్టు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • తొలి ఇన్నింగ్స్ లో 40 ఓవర్లలో 1 వికెట్ కు 120 పరుగులతో ఆడుతున్న భారత్
ఓల్ట్ ట్రాఫర్డ్ టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ నిలకడగా ఆడి, తొలి వికెట్ కు 94 పరుగులతో పటిష్టమైన పునాది వేశారు. కేఎల్ రాహుల్ 98 బంతుల్లో 4 ఫోర్లతో 46 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ వికెట్ క్రిస్ వోక్స్ కు దక్కింది.

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని, పిచ్ పై ఉన్న తేమ కండిషన్ ను ఉపయోగించుకోవాలన్న ఇంగ్లండ్ ఎత్తుగడలు నెరవేరలేదు. జైస్వాల్, రాహుల్ జాగ్రత్తగా ఆడుతూనే, పరుగులు రాబట్టారు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్కోరు 40 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 120 పరుగులు. క్రీజులో యశస్వి జైస్వాల్ (58 బ్యాటింగ్), సాయి సుదర్శన్ (13 బ్యాటింగ్) ఉన్నారు. 
Yashasvi Jaiswal
India vs England
4th Test
Old Trafford Test
KL Rahul
Sai Sudharsan
Cricket
India batting
Chris Woakes
India innings

More Telugu News