Chiranjeevi: మన 'శంకరవరప్రసాద్' గారు ముచ్చటగా మూడో షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు: అనిల్ రావిపూడి

Chiranjeevi completes Mega157 third schedule with Anil Ravipudi
  • చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మెగా157
  • కేరళలో మూడో షెడ్యూల్ పూర్తి
  • అప్ డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, యంగ్  డైరెక్టర్ అనిల్  రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా కేరళ షెడ్యూల్ కూడా ముగిసింది. దీనికి సంబంధించిన అప్ డేట్ ను దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో పంచుకున్నారు. మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడో షెడ్యూల్ ను కేరళలో పూర్తిచేసుకుని వచ్చారు అంటూ ఓ వీడియోను పంచుకున్నారు. అందులో, చిరంజీవి, అనిల్ రావిపూడి తదితరులు చార్టర్డ్ ప్లేన్ ఎక్కడం, హైదరాబాదులో ల్యాండవడం చూడొచ్చు. 

కాగా, ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతానికి మెగా157 వర్కింగ్ టైటిల్ తో లాగించేస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. చిరంజీవి తనయ సుష్మిత, సాహు గారపాటి ఈ చిత్రానికి నిర్మాతలు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
Chiranjeevi
Mega157
Anil Ravipudi
Tollywood
Nayanthara
Kerala Schedule
Shankara Varaprasad
Bheems Ceciroleo
Sushmita Konidela
Sahu Garapati

More Telugu News