'వీరమల్లు' నుంచి వీర రికార్డులు తప్పించుకోలేనట్టే!
- రేపు థియేటర్లకు 'హరిహర వీరమల్లు'
- ఒక రేంజ్ లో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్
- అభిమానులలో పెరుగుతున్న అంచనాలు
- రికార్డుస్థాయి ఓపెనింగ్స్ ఖాయమంటున్న ఫ్యాన్స్
నిజానికి పవన్ కల్యాణ్ ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు చేయలేదు. తన రాజకీయ కార్యకలాపాలకు అడ్డురాకుండా ఉండేలా ఆయన చిన్న సినిమాల రీమేకులు చేస్తూ వెళ్లారు. అలా వచ్చినవే 'వకీల్ సాబ్' .. 'భీమ్లా నాయక్' .. 'బ్రో' సినిమాలు. ఈ మూడు కూడా రీమేక్ గా ప్రేక్షకులను పలకరించినవే. పవన్ రేంజ్ కి ఇవి చాలా తక్కువ బడ్జెట్ సినిమాలు. అయినా 100 కోట్ల మార్కును అవలీలగా దాటేయడం ఆయన క్రేజ్ కి కొలమానం.
ఈ నేపథ్యలోనే పవన్ 'హరిహర వీరమల్లు' వంటి భారీ బడ్జెట్ సినిమాను ఒప్పుకున్నాడు. అయితే ఆయనకి గల బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాను పూర్తి చేయడానికి చాలా సమయం పట్టింది. పవన్ ఫ్యాన్స్ వెయిటింగ్ కి తెరదించుతూ రేపు థియేటర్లకు ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూసినవారు, వీరమల్లు వీరవిహారం తప్పదని చెబుతున్నారు. పవన్ కెరియర్ లో రికార్డుస్థాయి ఓపెనింగ్స్ ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే నిజమవుతుందేమో చూడాలి మరి.