Ambati Rambabu: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వాలి: అంబ‌టి రాంబాబు

Ambati Rambabu wishes Pawan Kalyans Hari Hara Veera Mallu a blockbuster
  • ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు
  • రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న మూవీ
  • సినిమాపై వైసీపీ నేత అంబ‌టి ఇంట్రెస్టింగ్ ట్వీట్‌
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా వ‌స్తున్న తాజా చిత్రం 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'. ఈ సినిమా రేపు (గురువారం)  ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇక‌, చాలా రోజులుగా త‌మ అభిమాన హీరో తెర‌పై క‌నిపించక‌పోవ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. నేడు కొన్నిచోట్ల ప్రీమియ‌ర్ షోలు ప‌డ‌నున్నాయి. దీంతో అప్పుడే థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల హంగామా మొద‌లైంది. 

ఇదిలాఉంటే.. వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఈ మూవీపై చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై నిత్యం అవాకులు చెవాకులు పేల్చే ఆయ‌న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఈ మేర‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా అంబ‌టి ప్ర‌త్యేకంగా పోస్టు పెట్టారు. 

"పవన్ కల్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' సూపర్ డూపర్ హిట్టై, కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను!" అని ఆయ‌న ట్వీట్ చేశారు. అయితే, ఒక‌వైపు వైసీపీ పార్టీ వారు ప‌వ‌న్ త‌న సొంత సినిమా కోసం టికెట్ ధ‌ర‌లు భారీగా పెంచేశార‌ని కామెంట్స్ చేస్తున్న స‌మ‌యంలో అంబ‌టి రాంబాబు పోస్టు ఇప్పుడు అటు సినీ ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. 


Ambati Rambabu
Hari Hara Veera Mallu
Pawan Kalyan
YCP
YS Jagan
Telugu Movie
Movie Release
Andhra Pradesh Politics
AP Politics
Tollywood

More Telugu News