MiG-21: ఎగిరే ‘శవపేటిక’లకు ఇక సెలవు.. మిగ్-21 ఫైటర్ జెట్లకు రిటైర్మెంట్!
- 62 సంవత్సరాలపాటు సేవలందించిన మిగ్-21 ఫైటర్ జెట్లు
- ఇండో-పాక్ యుద్ధం సహా పలు ఆపరేషన్లలో విజయాలు అందించిన ఫైటర్ జెట్లు
- వాటి స్థానంలో స్వదేశీ యుద్ధ విమానాలు తేజస్ రంగ ప్రవేశం
- సెప్టెంబర్ 19న ఛండీగఢ్‌లో వీడ్కోలు కార్యక్రమం
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) చరిత్రలో ఒక శకం ముగియనుంది. దాదాపు 62 సంవత్సరాలుగా భారత ఆకాశంలో తనదైన ముద్ర వేసిన ఐకానిక్ మిగ్-21 ఫైటర్ జెట్‌లను సెప్టెంబర్ 2025 నాటికి పూర్తిగా ఉపసంహరించుకోనున్నట్ట ఐఏఎఫ్ ప్రకటించింది. రాజస్థాన్‌లోని నల్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సోవియట్-యుగం జెట్ల స్థానంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) మార్క్-1ఏ రంగ ప్రవేశం చేయనుంది. ఈ నిర్ణయం ఐఏఎఫ్ ఆధునీకరణలో కీలక అడుగుగా భావిస్తున్నారు. అయితే తేజస్ జెట్ల డెలివరీలో ఆలస్యం స్క్వాడ్రన్ సంఖ్యపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మిగ్-21 చరిత్ర.. విజయాలు, విషాదాలు
1963లో సోవియట్ యూనియన్‌తో కుదిరిన ఒప్పందం ద్వారా భారత వాయుసేనలో చేరిన మిగ్-21 దేశం మొట్టమొదటి సూపర్‌సోనిక్ జెట్‌గా చరిత్రలో నిలిచింది. 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం, 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధంలో ఈ జెట్లు కీలక పాత్ర పోషించి, అనేక విజయాలను భారత వైమానిక దళానికి అందించాయి.
అయితే, ఈ జెట్‌కు విషాద చరిత్ర కూడా ఉంది. గత ఆరు దశాబ్దాల్లో 400కు పైగా ప్రమాదాల్లో 200 మంది పైలట్లు మరణించడంతో, ఈ జెట్లను అనధికారికంగా ‘ఫ్లయింగ్ కాఫిన్’ (ఎగిరే శవపేటిక)గా అభివర్ణించారు. ప్రస్తుతం, నల్ ఎయిర్ బేస్‌లో 26-28 మిగ్-21 బైసన్ జెట్లతో ఒకటిన్నర స్క్వాడ్రన్‌లు మాత్రమే కార్యకలాపాల్లో ఉన్నాయి.
తేజస్ మార్క్-1ఏ.. స్వదేశీ శక్తికి ప్రతీక
మిగ్-21 స్థానంలో రానున్న తేజస్ మార్క్-1ఏ జెట్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారు చేస్తోంది. 2021లో 83 తేజస్ మార్క్-1ఏ జెట్ల కోసం ఒప్పందం కుదిరింది. మరో 97 జెట్ల కోసం ఆర్డర్ ఈ ఏడాది ఖరారు కానుంది. ఇది స్వదేశీ రక్షణ ఉత్పత్తికి ఊతమిస్తుంది.
అయితే, జీఈ ఏరోస్పేస్ నుంచి ఇంజన్ సరఫరాలో ఆలస్యం కారణంగా మార్చి 2024 నుంచి డెలివరీలు ప్రారంభం కావాల్సిన తేజస్ మార్క్-1ఏ జెట్లు ఇప్పటివరకు ఐఏఎఫ్‌కు అందలేదు. ఈ ఆలస్యం ఐఏఎఫ్ స్క్వాడ్రన్ సంఖ్యను 42 నుంచి 29కి తగ్గిస్తుందని, ఇది గత ఆరు దశాబ్దాల్లో అత్యల్ప స్థాయిగా ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, సెప్టెంబర్ 19న ఛండీగఢ్ ఎయిర్‌బేస్‌లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు.