Pune Government Official: భర్తే అంత నీఛానికి ఒడిగట్టాడా! బాత్రూంలో వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

Pune Government Official Blackmailed Wife with Bathroom Videos
  • భార్య బాత్రూంలో స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో రికార్డింగ్
  • పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న భర్త
  • పోలీసులను ఆశ్రయించిన బాధిత ప్రభుత్వ అధికారిణి
  • పూణెలోని అంబేగావ్‌లో ఘటన
ఆయన ఒక ప్రభుత్వ అధికారి. ఆయన అర్ధాంగి కూడా క్లాస్ 1 ప్రభుత్వ అధికారిణి. కానీ ఆయన చేసిన పని తెలిస్తే అందరూ అసహ్యించుకుంటారు. ఇంట్లో భార్య స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీశాడు. డబ్బు కోసం ఆ వీడియోలను బయటపెడతానంటూ అర్ధాంగినే బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ ఘటన పూణెలోని అంబేగావ్‌లో జరిగింది.

భర్త వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్లాస్ 1 ప్రభుత్వ అధికారిణిగా పని చేస్తున్న ఒక మహిళకు 2020లో ప్రభుత్వ ఉద్యోగి అయిన వ్యక్తితో వివాహం జరిగింది. భర్త బాత్రూంలో తాను స్నానం చేస్తుండగా రహస్య కెమెరాలతో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. కారు, ఇంటి లోన్ కట్టేందుకు డబ్బులు కావాలని, పుట్టింటి నుంచి రూ.1.5 లక్షలు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

డబ్బులు తీసుకురాకపోతే వీడియోలను బయటపెడతానని బెదిరిస్తున్నాడని, మానసికంగా, శారీరకంగా నిత్యం హింసిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భర్త కుటుంబ సభ్యుల నుంచి కూడా వేధింపులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా సాంకేతిక ఆధారాలు, వీడియో ఫుటేజీలు వంటివి పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు. 
Pune Government Official
Pune
Government Official
Blackmail
Wife Blackmail
Bathroon Videos
Domestic Violence
Extortion
Class 1 Officer
Ambegao

More Telugu News