Howard Phillips: రష్యన్ ఏజెంట్లుగా భావించి అండర్ కవర్ బ్రిటిష్ ఏజెంట్లకు సమాచారం.. బ్రిటన్ వ్యక్తి అరెస్టు

Howard Phillips Arrested for Spying for Russia in UK
  • బ్రిటిష్ ఏజెంట్లకు పట్టుబడిన హోవర్డ్ ఫిలిప్స్
  • రష్యన్ ఏజెంట్లకు మాజీ మంత్రికి సంబంధించిన సమాచారం అందజేసే ప్రయత్నం
  • బ్రిటిష్ ఏజెంట్లకు దొరకడంతో దోషిగా తేల్చిన కోర్టు
బ్రిటన్‌కు చెందిన హోవర్డ్ ఫిలిప్స్ అనే వ్యక్తి రష్యాకు గూఢచర్యం చేయడానికి ప్రయత్నించి బ్రిటిష్ నిఘా ఏజెంట్లకు చిక్కాడు. బ్రిటన్ రక్షణ శాఖ మాజీ మంత్రి గ్రాంట్ షాప్స్‌కు సంబంధించిన సమాచారాన్ని రష్యన్ ఏజెంట్లుగా భావించిన ఇద్దరు వ్యక్తులకు చేరవేసేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ ఇద్దరు అండర్ కవర్‌లో ఉన్న బ్రిటిష్ నిఘా ఏజెంట్లు కావడంతో అతడి ప్రయత్నం విఫలమైంది.

ఈ కేసులో స్థానిక కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. బ్రిటన్ రక్షణ ప్రణాళికలను రష్యన్లు తెలుసుకునేందుకు వీలుగా మాజీ మంత్రికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, ఆయన ప్రైవేటు విమానాన్ని ఉంచిన ప్రదేశం వంటి కీలక వివరాలను అందజేయడానికి ఫిలిప్స్ ప్రయత్నించాడని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

'జేమ్స్ బాండ్'లా ఉండాలని అతడు కలలు కనేవాడని ఫిలిప్స్ మాజీ భార్య కోర్టుకు తెలియజేసింది. బ్రిటిష్ సీక్రెట్ సర్వీసెస్‌ను ఆధారంగా చేసుకుని వచ్చిన సినిమాలు చూసేవాడని వెల్లడించింది. స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చిన అతడు, దీని వల్ల దేశానికి వాటిల్లే ముప్పు గురించి ఏమాత్రం పట్టించుకోలేదని అధికారులు పేర్కొన్నారు.
Howard Phillips
UK
Russia
British Intelligence
Grant Shapps
Espionage
Spying
Defense Secrets

More Telugu News