TG TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

Telangana TET Exam Results Declared Online
  • టీజీ టెట్ ఫలితాల్లో 33.98 శాతం అభ్య‌ర్థుల ఉత్తీర్ణత
  • జూన్ 18 నుంచి 30 వరకు జ‌రిగిన పరీక్షల‌కు 1,37,429 మంది హాజరు
  • మొత్తం మీద 30,649 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు విద్యాశాఖ వెల్లడి
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) ఫలితాలను విద్యాశాఖ విడుద‌ల చేసింది. జూన్ 18 నుంచి 30 వరకు నిర్వహించిన పరీక్షకు 1,37,429 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 33.98 శాతం అభ్య‌ర్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద 30,649 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు విద్యాశాఖ వెల్లడించింది. టెట్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఆన్ లైన్ లో నేరుగా విడుదల చేశారు. 

పేపర్ 1,2 లకు ఏడు భాషల్లో ప‌రీక్ష‌ నిర్వహించారు. పేపర్ 1 పరీక్షకు 47,224 మంది హాజరైతే.. 29,043 మంది పాస్ అయ్యారు. పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ లో 48,998 మంది పరీక్ష రాస్తే 17,574 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 లోని సోషల్ స్టడీస్ లో 41,207 మంది ఎగ్జామ్ రాస్తే 13,075 మంది ఉత్తీర్ణులయ్యారు. అధికారిక వెబ్‌సైట్ http://tgtet.aptonline.in/tgtet/ResultFront లో అభ్య‌ర్థులు త‌మ ఫ‌లితాలు చూసుకోవ‌చ్చ‌ని అధికారులు తెలిపారు. 
TG TET Results
Telangana TET
Telangana Teacher Eligibility Test
Yogita Rana
Education Department Telangana
TET Results 2024
Teacher Recruitment Telangana
Telangana Government Exams

More Telugu News