Kadapa Central Jail: కడప సెంట్రల్ జైలులో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

Kadapa Central Jail staff suspended for providing cell phones to prisoners
  • జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్‌తో పాటు మరో ముగ్గురు సస్పెన్షన్
  • ఉత్తర్వులు జారీ చేసిన జైళ్ల శాఖ డీజీ
  • ఖైదీలకు సెల్ ఫోన్లు అందిస్తున్నారన్న ఆరోపణలతో విచారణ జరిపిన డీఐజీ

కడప సెంట్రల్ జైలులో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు, ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ తో పాటు మరో ముగ్గురు జైలు వార్డర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు.

జైలులో ఖైదీలకు సెల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు మొబైల్ ఫోన్లు అందిస్తున్నారన్న అభియోగాలపై గత నాలుగు రోజులుగా జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ విచారణ జరిపారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు. 
Kadapa Central Jail
Kadapa jail
jailer Apparao
Deputy superintendent Kamalakar
smugglers
cell phones
jail suspension
Andhra Pradesh
DIG Ravi Kiran
Erra Chandanam

More Telugu News