Gita Gopinath: ఐఎంఎఫ్‌ను నుంచి వైదొల‌గ‌నున్న గీతా గోపీనాథ్

Gita Gopinath to step down from IMF in August set to rejoin Harvard
  • ఐఎంఎఫ్‌లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప‌నిచేస్తున్న‌ గీతా గోపీనాథ్
  • ఆగస్టులో తన ప‌ద‌వి నుంచి వైదొలగ‌నున్నార‌ని ఐఎంఎఫ్ వెల్ల‌డి
  • తిరిగి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెస‌ర్‌గా చేర‌నున్నార‌ని ప్ర‌క‌ట‌న‌
  • గోపీనాథ్ నిష్క్రమణను ధ్రువీకరించిన ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివా
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప‌నిచేస్తున్న‌ గీతా గోపీనాథ్ ఆగస్టులో తన ప‌ద‌వి నుంచి వైదొల‌గ‌నున్నారు. ప‌ద‌వి నుంచి వైదొలిగిన త‌ర్వాత ఆమె తిరిగి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెస‌ర్‌గా చేర‌నున్నార‌ని ఐఎంఎఫ్ ఒక‌ ప్రకటన‌లో పేర్కొంది.

ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా... గోపీనాథ్ నిష్క్రమణను ధ్రువీకరించారు. ఆమె త‌ర్వాత ఆ ప‌ద‌వి చేప‌ట్టే వ్య‌క్తిని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. కాగా, గోపీనాథ్ మొదట 2019లో చీఫ్ ఎకనామిస్ట్‌గా ఐఎంఎఫ్‌లో చేరారు. ఆ పదవిని నిర్వహించిన మొదటి మహిళగా నిలిచారు. క‌రోనా మహమ్మారి, దాని ఫలితంగా ఏర్పడిన స్థూల ఆర్థిక అంతరాయాలతో సహా అసాధారణ ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆమె నాయకత్వ ప‌టిమ‌కు మంచి గుర్తింపు పొందారు. 2022 జనవరిలో ఆమెకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి ల‌భించింది.

గోపీనాథ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఐఎంఎఫ్‌లో తన ఏడేళ్ల‌ పదవీకాలాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక సంస్థలలో ఒకదానిలో సేవ చేసే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Gita Gopinath
IMF
International Monetary Fund
Deputy Managing Director
Harvard University
Kristalina Georgieva
Chief Economist
Economic Crisis
Global Economy
Resignation

More Telugu News