Narendra Modi: సాయం చేసేందుకు సిద్ధం: బంగ్లాదేశ్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ

Narendra Modi expresses grief over Bangladesh plane crash
  • ఢాకాలో కూలిన శిక్షణ యుద్ధ విమానం
  • పాఠశాలపై పడి పైలట్, విద్యార్థులు సహా 19 మంది మృతి
  • ఈ ప్రమాదం తనను కలిచివేసిందన్న మోదీ
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌కు భారత్ అండగా ఉంటుందని, సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా తెలిపారు.

విమాన ప్రమాద వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని, మృతుల్లో చాలామంది విద్యార్థులు ఉన్నారని తెలిసి బాధ కలిగిందని పేర్కొన్నారు. ఈ దుర్ఘటన తనను ఎంతగానో కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన శిక్షణ యుద్ధ విమానం ఢాకా సమీపంలోని పాఠశాలపై కూలిపోయిన ఘటనలో పైలట్‌తో పాటు 16 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా గాయపడ్డారు.
Narendra Modi
Bangladesh plane crash
Dhaka plane accident
Bangladesh air force
India Bangladesh relations

More Telugu News