Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ బాబు

Mohan Babu consoles Kota Srinivasa Rao family
  • జులై 13న కన్నుమూసిన కోట శ్రీనివాసరావు
  • ఆ సమయంలో తాను విదేశాల్లో ఉన్నానని మోహన్ బాబు వెల్లడి
  • కోటతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని వివరణ 
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మరణంపై నటుడు మోహన్ బాబు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జులై 13న కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణించినప్పుడు మోహన్ బాబు విదేశాల్లో ఉండటం వల్ల నివాళులర్పించడానికి రాలేకపోయారు. ఈ విషయంపై పలు రకాల ప్రచారాలు జరిగాయి.

తాజాగా, మోహన్ బాబు హైదరాబాదులో కోట శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "కోట శ్రీనివాసరావు నాకు ఎంతో ఆత్మీయుడు. ఆయనతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన చనిపోయినప్పుడు నేను ఊరిలో లేను, విదేశాల్లో ఉన్నాను. అందుకే ఆ రోజు రాలేకపోయాను. అందుకు ఎంతో బాధగా ఉంది" అని తెలిపారు.

కోట శ్రీనివాసరావు గొప్ప నటుడని, ఎలాంటి డైలాగ్ అయినా కమెడియన్‌గా, విలన్‌గా రకరకాల యాసల్లో చెప్పగలిగే నటుడు ఆయన మాత్రమేనని మోహన్ బాబు కొనియాడారు. "ఆయన లేని లోటును ఇండస్ట్రీలో ఎవరూ తీర్చలేరు. ఆయన కుటుంబం మా కుటుంబానికి ఎంతో దగ్గర. చాలా సార్లు అందరం కలిసి గడిపాం. ఇప్పుడు ఆయన లేకపోవడం చాలా బాధాకరం" అంటూ మోహన్ బాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Kota Srinivasa Rao
Mohan Babu
Telugu actor
Kota Srinivasa Rao death
Mohan Babu condolences
Telugu cinema
Hyderabad
Film industry
Actor tribute

More Telugu News