Sensex: 442 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

Sensex Climbs 442 Points in Todays Trading
  • లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • 122 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 86.30
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. విశ్లేషకుల అంచనాలకు మించి పలు త్రైమాసిక ఫలితాలు ప్రకటించడం సూచీలకు కలిసొచ్చింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 442 పాయింట్లు లాభపడి 82,200కి చేరుకుంది. నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 25,090 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 86.30గా ఉంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ లో ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, బీఈఎల్ షేర్లు రాణించాయి. రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్సీఎల్, టీసీఎస్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.
Sensex
Stock Market
Indian Stock Market
Nifty
BSE Sensex
Share Market
Rupee
ICICI Bank
HDFC Bank
Mahindra and Mahindra

More Telugu News