Pawan Kalyan: నిర్మాత ఏఎం రత్నంకు ఆ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు ప్రతిపాదించా: పవన్ కల్యాణ్

Pawan Kalyan Proposes AM Ratnam for AP Film Development Chairman Post
  • ఏఎం రత్నంకు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ప్రతిపాదించానన్న పవన్
  • ఆయనకు ఈ పదవి ఇస్తే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుందని వ్యాఖ్య
  • అందరు హీరోలతో ఆయన పనిచేశారని కితాబు
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'హరి హర వీరమల్లు' సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కెరీర్ లో ఇది తొలి పాన్ ఇండియా సినిమా కావడం గమనార్హం. ఈ చిత్రంలో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. 

ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించింది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. బాబీ డియోల్, సత్యరాజ్, అనుపమ్ ఖేర్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో పవన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలియదని... ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏఎం రత్నమే కారణమని చెప్పారు. ప్రాంతీయ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఏఎం రత్నం అని కితాబునిచ్చారు. ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ ఛైర్మన్ గా ఏఎం రత్నంను చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను ప్రతిపాదించానని సంచలన కీలక విషయాన్ని వెల్లడించారు. కేవలం తన నిర్మాత అనే ఉద్దేశంతోనే తాను ఈ పదవికి ఆయన పేరును ప్రతిపాదించలేదని... ఆయన అందరు హీరోలతో పనిచేశారని చెప్పారు. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు పరిచయాలు ఉన్నాయని తెలిపారు. ఆయనకు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుందని అన్నారు. తన పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఏఎం రత్నం పేరును ప్రతిపాదించానని తెలిపారు. 
Pawan Kalyan
Hari Hara Veera Mallu
AM Ratnam
AP Film Development Corporation
Chandrababu Naidu
Nidhi Agarwal
Pan India Movie
Telugu Cinema
Film Promotion
Telugu Film Industry

More Telugu News