Bangladesh Air Force: బంగ్లాదేశ్‌లో పాఠశాలపై కూలిన యుద్ధ విమానం

Bangladesh Air Force Plane Crashes Into School
  • పైలట్‌తో పాటు ఒక విద్యార్థి మృతి
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఆందోళన
  • ఎఫ్-7బీజీఐ ఎయిర్‌క్రాఫ్ట్ కూలినట్లు బంగ్లా ఆర్మీ వెల్లడి
బంగ్లాదేశ్‌లో విషాదకర విమాన ప్రమాదం సంభవించింది. బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన శిక్షణ యుద్ధ విమానం స్థానిక మైల్‌స్టోన్ పాఠశాలపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్‌తో పాటు ఒక విద్యార్థి మృతి చెందగా, పలువురికి గాయాలైనట్లు సమాచారం. పాఠశాలలో విద్యార్థులు ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

యుద్ధ విమానం కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఎఫ్-7బీజీఐ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ అధికార ప్రతినిధి ధృవీకరించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Bangladesh Air Force
Bangladesh
F-7BGI Aircraft
Plane Crash
Air Force Plane Crash
School

More Telugu News