Arunachalam: బస్సులో తిరువణ్ణామలైకి బదులు 'అరుణాచలం' పేరు.. కండక్టర్ సస్పెన్షన్

Arunachalam Instead of Tiruvannamalai Displayed on Bus Conductor Suspended
  • బస్సు ఎల్ఈడీ తెరపై అరుణాచలం అంటూ అంగ్ల అక్షరాల్లో ప్రదర్శన
  • 'తిరవణ్ణామలై' పేరును తప్పనిసరిగా వాడాలని కండక్టర్లకు సూచన
  • అరుణాచలం పేరు ఉంచిన కండక్టర్‌ను సస్పెండ్ చేసిన జనరల్ మేనేజర్
తిరువణ్ణామలై వెళ్లే బస్సులో తిరువణ్ణామలైకి బదులుగా అరుణాచలం అని బోర్డు ప్రదర్శించినందుకు తమిళనాడు ఆర్టీసీ యాజమాన్యం ఒక కండక్టర్‌ను సస్పెండ్ చేసింది. ఈ సంఘటన ఈ నెల 15వ తేదీన చోటు చేసుకుంది. కళ్లకురిచ్చి ప్రభుత్వ రవాణా సంస్థ డిపో నుంచి ఒక బస్సు బెంగళూరుకు బయలుదేరింది. ఈ బస్సు ముందుభాగంలో ఎల్ఈడీ తెరపై తిరువణ్ణామలైకు బదులుగా అరుణాచలం అని ఆంగ్ల అక్షరాలలో ప్రదర్శించారు.

దీనిని గమనించిన కొందరు ప్రయాణికులు సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఒక సామాజిక కార్యకర్త ఈ విషయంపై ప్రభుత్వ రవాణా సంస్థను ప్రశ్నించారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించారు.

ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు ఆ సామాజిక కార్యకర్తకు అధికారులు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ పంపించారు. అదే సమయంలో తిరువణ్ణామలై వెళ్లే బస్సులో తప్పనిసరిగా అదే పేరును ప్రదర్శించాలని కండక్టర్లకు సూచించారు. మరోవైపు, అరుణాచలం అనే పేరును ఉంచిన కళ్లకురిచ్చికి చెందిన కండక్టర్ విజయ రాఘవన్‌ను సస్పెండ్ చేస్తూ విల్లుపురం జోన్ జనరల్ మేనేజర్ జయశంకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Arunachalam
Tiruvannamalai
Tamil Nadu RTC
Bus Conductor Suspended
Villupuram Zone

More Telugu News