Mudragada Padmanabham: హైదరాబాద్ కు ముద్రగడ తరలింపు... కిర్లంపూడిలోని ఇంటి వద్ద కొన్ని నిమిషాలు ఉన్న వైనం

Mudragada Padmanabham Shifted to Hyderabad for Treatment
  • కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ముద్రగడ
  • మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలింపు
  • ముద్రగడ కోరిక మేరకు రోడ్డు మార్గంలో తరలింపు
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వైసీపీ నేత ముద్రగడం పద్మనాభంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ క్రమంలో కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను అక్కడి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాకినాడ ఆసుపత్రిలో ఆయనకు డయాలసిస్ ట్రీట్మెంట్ చేశారు. 

హైదరాబాద్ కు వెళ్లే ముందు కిర్లంపూడిలోని తన ఇంటికి వెళ్లాలని ఉందని ముద్రగడ కోరారు. దీంతో, ఆయనను కాకినాడ నుంచి కిర్లంపూడికి తీసుకెళ్లారు. ఇంటి దగ్గర కొన్ని నిమిషాల పాటు ఆయన ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను బంధువులు, సన్నిహితులు, అభిమానులు పరామర్శించారు. త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. 

మరోవైపు, ముద్రగడను రాజమండ్రి నుంచి ఎయిల్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాలని తొలుత భావించారు. అయితే, దానికి ముద్రగడ అంగీకరించలేదు. దీంతో, రోడ్డు మార్గం ద్వారా ఆయనను అంబులెన్సులో హైదరాబాద్ కు తరలించారు.
Mudragada Padmanabham
Mudragada
YSRCP Leader
Kidney Ailment
Kirlampudi
Hyderabad
Dialysis Treatment
Health Update

More Telugu News